Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб పురాతన ఆలయంలో దాగిన తంత్రం యొక్క రహస్య మూలం! |ప్రవీణ్ మోహన్| в хорошем качестве

పురాతన ఆలయంలో దాగిన తంత్రం యొక్క రహస్య మూలం! |ప్రవీణ్ మోహన్| 11 месяцев назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



పురాతన ఆలయంలో దాగిన తంత్రం యొక్క రహస్య మూలం! |ప్రవీణ్ మోహన్|

ENGLISH CHANNEL ➤    / phenomenalplacecom   Facebook..............   / praveenmohantelugu   Instagram................   / praveenmohantelugu   Twitter......................   / pm_telugu   Email id - [email protected] మీరు నాకు మద్దతు ఇవ్వాలనుకుంటే, నా Patreon ఖాతాకు లింక్ ఇక్కడ ఉంది -   / praveenmohan   Hey guys, ఈరోజు మనం, చాలా విచిత్రమైన, పురాతనమైన జస్మల్‌నాథ్‌జీ ఆలయాన్ని అన్వేషించబోతున్నాము. వికీపీడియా కూడా, ఈ ఆలయం గురించి, ఏమీ చెప్పడంలేదు, కానీ ఈ ఆలయం, దాని విచిత్రమైన రహస్యాలకు ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం యొక్క ప్రధాన దేవుడు ఎవరు? దీని లోపల ఎలాంటి రహస్యాలు దాగి ఉన్నాయి? ఈ ఆలయంలోకి ప్రవేశించే ముందు కూడా, మీరు ఆలయం బయట ఉన్న ఈ స్తంభాలను చూడవచ్చు. ఈ కొత్త ప్రవేశద్వారం, ఈ 2 స్తంభాలు మాత్రమే ప్రవేశ ద్వారంలో భాగమని మీరు అనుకునేలా చేస్తుంది, అంతేకాకుండా ఈ ప్రాంతానికి అడ్డుకట్ట వేశారు, కాబట్టి ఈ పాయింట్ దాటి ఎవరూ దీన్ని చూడలేరు. కానీ ఈ స్తంభంపై, మీరు చాలా విచిత్రమైన ఒక చెక్కడాన్ని చూడవచ్చు, హిందూ ఆలయాల యొక్క ప్రవేశద్వారం వద్ద, ఇటువంటి చెక్కడం ఉండడం చాలా అసాధారణమైనది. ఆమె ఎవరు? ఆమె ఎందుకు అలా కనిపిస్తుంది? ఆమె కళ్ళు బయటకు వస్తున్నాయి, మరియు ఆమె నోటిలో ఒక వేలు పెట్టుకొని, నవ్వుతున్నట్లు కనిపిస్తుంది చూడండి. కానీ ఈ చిరునవ్వు, మీ వెన్నెముకను చల్లబరుస్తుంది, కదా? ఆమె ఒక స్తంభంపై, పుర్రెను ఎలా ఉంచిందో ఒకసారి గమనించండి అలానే దానిని తన పక్కనే ఉంచుకుంది. మరియు ఆమె కడుపు మీద ఉన్నదీ ఏంటీ? అది తేలునా? పురాతన నిర్మాణదారులు, ఈ పురాతన ఆలయ ప్రవేశద్వారం వద్ద ఇలాంటి బొమ్మను ఎందుకు చెక్కాలని నిర్ణయించుకున్నారు? ఈ ఆలయం యొక్క ప్రధాన దేవతను మీరు ఊహించి చెప్పగలరా? నేను ఈ ప్రధాన గది వైపు నడిచినప్పుడు, ఆలయం పైన ఒక interesting అయినా చెక్కడాన్ని గమనించాను. ఇక్కడ ఒక స్త్రీ దేవత చుట్టూ అనేకమంది స్త్రీలు చుట్టుముట్టి ఉన్నారు. And interesting అయినా విషయం ఏంటంటే, ఈ సంరక్షకుల డోర్ కీపర్లు ఇద్దరూ కూడా ఆడవారే. ఆశ్చర్యం ఏంటంటే, మనం ఈ ప్రధాన గదిలో, ఒక లింగాన్ని చూస్తున్నాము, అంటే ఈ ఆలయ ప్రధాన దేవుడు శివుడు. ఇక్కడున్న పూజారి, నన్ను ఈ లింగాన్ని, దగ్గరగా చూసేందుకు అనుమతించారు. ఈ లింగానికి పైభాగంలో మరియు మరికొన్ని చోట్ల, కొద్దిగా damage అయినట్లుగా ఉంది, నుదుటిపై, మూడవ కన్నుతో సహా, 3 కళ్ళును లింగంపై ఉంచారు చూడండి. కానీ, ఇవన్నీ recentగా చేరినవి, ఈ పూజారి సాధారణంగా లింగాన్ని అలంకరించి ముఖంలాగా చేస్తారు. మీరు జాగ్రత్తగా గమనిస్తే, ఈ సిలిండర్ మరియు బేస్, ఒక బోల్ట్ మరియు గింజ లాగ, 2 వేర్వేరు భాగాలుగా కలిసి ఉన్నట్లు మీరు చూడవచ్చు. మీరు వాటి మధ్య కొంత ఖాళీని కూడా చూడవచ్చు, అలానే పైన కొన్ని ప్యాచ్‌వర్క్ కూడా ఉంది. కానీ మీరు ఈ baseని పరిశీలించినప్పుడు, ఈ కప్పు చెక్కడాలను, దానిపై చెక్కినట్టు గమనిస్తారు, అవి చూడడానికి కంటైనర్లు లేదా bowls లాగ కనిపిస్తాయి. వారు ఈ bowlsను లేదా కప్పులను, ఈ లింగం యొక్క base పై ఎందుకు చెక్కారు? కానీ ఈ లింగం వెనుక ఒక చెక్కడం దాగి ఉంది చూడండి. చాలా మంది visitorలు, దీనిని గమనించుండరు, కానీ మనం దీన్ని నిశితంగా పరిశీలిద్దాం. ఈ చెక్కడం, ఒక స్త్రీ దేవత మరియు ఆమె కుడి చేతిలో ఏం పట్టుకుని ఉంది?అది లింగమా? అవును. ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది, అదేంటంటే, అసలు ఈ ఆలయ ప్రధాన దేవుడు ఎవరు? అది లింగమా లేక ఆమె యేనా? 99% మంది ప్రజలు, ప్రధాన దేవుడు, లింగం అని అనుకుంటున్నారు, ఎందుకంటే size పరంగా చూసుకుంటే, ఇదే అతిపెద్దది విగ్రహం కాబట్టి. కానీ ఈ చెక్కడం, లింగం యొక్క పరిమాణంతో పోలిస్తే అమ్మవారి పరిమాణాన్ని తెలియజేస్తుంది. ఇక్కడ మనం ఈ రాక్షస లింగాన్ని చూస్తున్నాము, కానీ దాని వెనుక, ఆమె ఈ జెయింట్ లింగాన్ని తన చేతిలో పట్టుకుని ఉంది, అంటే ఆమె ఈ లింగం కంటే చాలా రెట్లు పెద్దది. కానీ ఆమె క్రింద ఉన్నదాన్ని చూడండి - ఇది ప్రతిదీ మారుస్తుంది. ఇది చాలా అరుదైన వర్ణన: ఎడమ వైపున, మీరు కాల భైరవ అనే వ్యక్తిని చూడవచ్చు. కుడి వైపున, మీరు మరొక బొమ్మను చూడవచ్చు, ఇతను రురు భైరవ అని పిలువబడే, హిందూ దేవుళ్ళలో చాలా అరుదైన ఒక వ్యక్తి. చాలా అరుదు, నేను ఇంతకు ముందు నా ఛానెల్‌లో అతని పేరును ఎప్పుడూ ప్రస్తావించలేదు, ఎందుకంటే అతని చెక్కిన శిల్పాన్ని, ఏ ఆలయంలోనైనా కనిపెట్టడం, దాదాపు అసాధ్యం. అసలు ఈ రురు భైరవ ఎవరు? రురు భైరవుడు, వేద కాలంలో ప్రసిద్ధి చెందిన, తెల్లని చర్మం గల మగ దేవుడు, మరియు అతని వింత లక్షణాల కారణంగా, ఈ రోజు భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో అతన్ని పూజించరు. మరోవైపు, మీరు ఈ చిన్న బొమ్మను చూడవచ్చు. అతను కాల భైరవ, నల్లని చర్మం లేదా ముదురు రంగు చర్మం గలవాడు. ఎడమ మరియు కుడి వైపున నలుపు మరియు తెలుపు యొక్క ప్రతీకవాదం - ఇది వాస్తవానికి తంత్రం యొక్క 2 మార్గాలను చూపించే సంకేతం. కానీ, మరిన్ని interesting అయినా వివరాలను చూడాల్సి ఉంది. ఆమె దిగువ కుడి చేయి ఖాళీగా ఉంది, కానీ, ఆమె దిగువ ఎడమ చేయి ఖాళీగా లేదు చూడండి. ఆమె ఏం పట్టుకుంది? ఆమె కుండను పట్టుకొని ఉందా? ఆ కుండ లోపల ఏముంది? కానీ, మరింత విచిత్రం ఏంటంటే: ఆమె కాలి పైభాగంలో చూడండి, అక్కడ ఏదో కనిపిస్తుంది కదా. ఇది ఏంటని మీరు నాకు చెప్పగలరా? ఇది తేలునా? #ప్రవీణ్_మోహన్ #హిందుత్వం #మననిజమైనచరిత్ర #praveenmohantelugu

Comments