Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб ఏంటీ? మన నీడ ఈ ఆలయంలో కనిపించదా? మోధేరా సూర్య దేవాలయం వెనుక దాగిన సైన్స్! в хорошем качестве

ఏంటీ? మన నీడ ఈ ఆలయంలో కనిపించదా? మోధేరా సూర్య దేవాలయం వెనుక దాగిన సైన్స్! 1 год назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



ఏంటీ? మన నీడ ఈ ఆలయంలో కనిపించదా? మోధేరా సూర్య దేవాలయం వెనుక దాగిన సైన్స్!

ENGLISH CHANNEL ➤    / phenomenalplacecom   Facebook..............   / praveenmohantelugu   Instagram................   / praveenmohantelugu   Twitter......................   / pm_telugu   Email id - [email protected] మీరు నాకు మద్దతు ఇవ్వాలనుకుంటే, నా Patreon ఖాతాకు లింక్ ఇక్కడ ఉంది -   / praveenmohan   Hey guys, మోధేరా అనే మారుమూల గ్రామంలో, అద్భుతమైన geometric perfectionతో నిర్మించిన చాలా విచిత్రమైన ఆలయం ఒకటుంది. ఇదే ఈ గుడి యొక్క ప్రధాన నిర్మాణం, నేను ఇక్కడున్న, ఈ ప్రవేశ ద్వారంలో ఒక compassని ఉంచుతున్నాను, సరిగ్గా ఈ రెండు రాళ్ల మధ్య, ఈ middle lineపై, ఈ alignmentను చూడండి. ఇది చాలా crazyగా ఉంది, ఇక్కడ తూర్పు-పశ్చిమ దిశ అంటే East - West directions కూడా ఎలాంటి error లేకుండా చాలా perfectగా, align అయ్యాయి చూడండి. పురాతన కాలంలో ఇటువంటి perfection ఎలా సాధ్యమైందో నాకు అర్థం కాలేదు, ఈ ఆలయం కనీసం 1000 సంవత్సరాల పురాతనమైనదిగా చెప్తున్నారు. ఈ ఆలయంలో, 3 ప్రధాన నిర్మాణాలు ఉన్నాయి, ఇక్కడున్న ఈ ప్రధాన మందిరం యొక్క alignmentను నేను మీకు already చూపించేసాను, ఇక్కడున్న రెండవ నిర్మాణాన్ని ఇప్పుడు మనం చూద్దాం. ఇది కూడా చాలా interestingగా ఉంది, ఎందుకంటే పురాతన నిర్మాణ దారులు, ఈ ప్రవేశాలలో నిర్దిష్ట గీతలను mark చేసి పెట్టారు. మనము దీనిపైనా, ఫోన్‌ను ఉంచినప్పుడు, ఈ alignment చాలా ఖచ్చితంగా ఉంది చూడండి, ఎటువంటి error కూడా లేదు. ఇది 0 డిగ్రీలు north అని చాలా ఖచ్చితంగా చూపిస్తుంది చూడండి. నేను, ఈ మొత్తం ఆలయ నిర్మాణాన్ని ప్రతిచోటా check చేసి చూసాను, ఇది మొత్తం ఎటువంటి errors లేకుండా చాలా perfectగా ఉంది. ఈ రకమైన ఖచ్చితత్వాన్ని, advanced technologyతో మాత్రమే సాధించవచ్చు. కానీ మీకు, compass చరిత్ర గురించి అర్థంకాలేదని అనుకుందాం, అప్పుడు ఇది చూడడానికి మీకు చాలా సులభం అనిపించవచ్చు. ఈరోజు, మనం ఈ alignmentను, ఒక decimal digitకు ఎంత perfectగా ఉందని ఎందుకు చూస్తున్నామంటే, ఇప్పుడు మనం ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగిస్తున్నాము. కానీ, వెయ్యి సంవత్సరాల క్రితం వెనక్కి వెళ్లి చూశామంటే, చాలా primitive అయినా compassలనే ప్రజలు ఉపయోగించారని, archeologistలు మరియు historians చెప్తున్నారు, వాళ్ళు నీటిలో తేలియాడే ఒక విధమైన లోడెస్టోన్ లేదా ముడి అయస్కాంతీకరించిన సూదులను ఉపయోగించారని కూడా చెప్తున్నారు. పురాతన నిర్మాణ దారులు, 0.01% లోపం కూడా లేకుండా, ఈ స్థాయి ఖచ్చితత్వాన్ని ఎలా సాధించగలిగారు? కానీ, ఇక్కడ దీనికంటే, పెద్ద ప్రశ్న కూడా ఉంది. వాళ్ళు దీన్ని, ఎలా చేశారో అనేది కాదు, ఎందుకు చేశారనేదే ఇక్కడ ముఖ్యమైన ప్రశ్న? ఇంత ఖచ్చితమైన alignment ఎందుకు అవసరం అయింది? ఈ ప్రధాన గది, సరిగ్గా తూర్పు వైపు ఎందుకు ఉండాలి? గత ఏడాది మార్చి 21న తీసిన ఈ photoని చూడండి. ఈ photoని ఉదయాన్నే సూర్యోదయం సమయంలో తీసింది, సూర్యుని యొక్క మొట్టమొదటి కిరణాలు, ఈ ప్రవేశాల మధ్యభాగం గుండా వెళ్లి, ప్రధాన గదిలోకి ప్రకాశిస్తాయి. ఈ దృగ్విషయం, సంవత్సరానికి రెండుసార్లు మాత్రమే జరుగుతుంది, మార్చి 21 మరియు సెప్టెంబర్ 23 న మాత్రమే ఇలా జరుగుతుంది. ఎందుకు ఇలా జరుగుతుంది?ఆ 2 రోజుల్లో, అంత ప్రత్యేకత ఏంటి అసలు? ఈ రోజులను equinox అని పిలుస్తారు, ఈ రెండు రోజులు మాత్రమే, పగలు మరియు రాత్రులు సరిగ్గా సమానంగా ఉంటాయి, అదే విధంగా, ఈ రెండు రోజులు మాత్రమే, సూర్యుడు సరిగ్గా తూర్పున ఉదయిస్తాడు. ఇది వినడానికి, మీకు ఒక newsలాగా ఉంటుంది, ఎందుకంటే, సూర్యుడు ఎప్పుడూ తూర్పు దిక్కునే కదా ఉదయిస్తాడని మీరు అనుకోవచ్చు, కానీ ఇది నిజం కాదు, actually మీరు చూశారంటే, exact అయినా తూర్పు దిక్కుకు, కొంచెం ఎడమ మరియు కుడి వైపున, మారి మారి సూర్యుడు ఉదయిస్తాడు, కానీ ఈ 2 రోజులలో మాత్రమే, సూర్యుడు ఖచ్చితంగా సున్నా డిగ్రీలో, తూర్పున ఉదయిస్తాడు. అందుకే, తూర్పు దిక్కుకు ఖచ్చితమైన alignmentను Equinoctial east అని కూడా అంటారు. ఇప్పుడు, ఈ ప్రధాన గది లోపల అసలు ఏముండేది? స్వచ్ఛమైన బంగారం మరియు వజ్రాలతో తయారు చేసిన, ఒక పెద్ద సూర్య భగవానుడు విగ్రహం, ఒకప్పుడు ఈ ప్రధాన గది లోపల ఉండేది. So, సూర్యుని మొదటి కిరణాలు, ఈ సూర్యుని విగ్రహంపై పడినప్పుడు, గది మొత్తం లైట్ షోలా మెరుస్తూ ఉండేది. కానీ, దీనికంటే, మరొక నమ్మలేని విషయం, ఇక్కడున్న స్థానికులనే ఆశ్చర్యపడేలా చేస్తుంది. ఈ ఆలయానికి, మీరు జూన్ 21వ తేదీ, మధ్యాహ్నం 12 గంటల సమయానికి వచ్చారంటే, మీరే చాలా ఆశ్చర్యపోతారు, ఎందుకంటే, ఈ ఆలయం యొక్క నీడ నేలపై చూడలేరు. అవును, ఈ ఆలయం నీడ, నేలపై పడదు. ఇదంతా వింటుంటే అసలు నమ్మే విధంగా ఉందా, ఇది ఒక సూడోసైన్స్ లాగా మీకు అనిపించవచ్చు, కానీ మీరు ఈ ప్రత్యేక రోజున, ఈ ఆలయంకి వచ్చి మధ్యాహ్నం 12 గంటలకు నిల్చుంటే, మీ నీడ కూడా నేలపై పడదు. మీలో కొందరు ఇది నమ్మరని నాకు తెలుసు, కాని మనం మరే ఇతర పురాతన దేవాలయంలో జరగని, ఒక స్వచ్ఛమైన శాస్త్రీయ దృగ్విషయం గురించి మాట్లాడుతున్నాము, ఇలాంటి ఒక విషయం మోధేరా సూర్య దేవాలయంలో మాత్రమే జరుగుతుంది. ఇది ఎలా సాధ్యం? ఎందుకంటే, ఈ ఆలయం, Tropic of Cancer అని పిలవబడే, ఒక నిర్దిష్ట రేఖపై, ఉద్దేశపూర్వకంగా నిర్మించారు. ఇప్పుడు, ఈ tropic of cancer అంటే ఏంటీ? Tropic of Cancer అనేది భూమిపై ఉన్న ఉత్తర రేఖ అంటారు, సూర్యుడు నేరుగా తలపైకి వచ్చిన ఒక lattitude అని చెప్పవచ్చు. ఈ రేఖకు మించి, సూర్యుడు ఎప్పుడూ నేరుగా తలపై లేదా దాని అత్యున్నత స్థాయి వద్ద కనిపించడు. మీరు ఈ tropic of cancer రేఖపై జూన్ 21న వచ్చి నిల్చున్నారంటే, మీ నీడ ఈ భూమిపై పడదు. ఈ జూన్ 21న అలాంటి ప్రత్యేకత ఏముంది? #ప్రవీణ్_మోహన్ #హిందుత్వం #మననిజమైనచరిత్ర #praveenmohantelugu

Comments