Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб 5 Layer Natural Farming in 75 Cents Land || Guntur Farmer Success Story || Rosaiah - 9666532921 в хорошем качестве

5 Layer Natural Farming in 75 Cents Land || Guntur Farmer Success Story || Rosaiah - 9666532921 6 лет назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



5 Layer Natural Farming in 75 Cents Land || Guntur Farmer Success Story || Rosaiah - 9666532921

ఈయన పేరు రోశయ్య. గుంటూరుజిల్లా అత్తోటు గ్రామానికి చెందిన ఈయన వయసు 73 ఏళ్లు. తనకున్న 75 సెంట్ల వ్యవసాయ భూమిలో పదేళ్లుగా సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. ఉన్నది తక్కువ స్థలమే అయినా... అందులోనే 24 రకాల మొక్కలను పెంచుతున్నారు. పండ్లు, కూరగాయలు, ఔషధ మొక్కలను సాగుచేస్తున్నారు. మొదట్లో కేవలం కొబ్బరి చెట్లను నాటిన రోశయ్య ఆ తర్వాత అంతరపంటలను వేయడం ప్రారంభించారు. ప్రస్తుతం కొబ్బరి చెట్లతోనే ఏడాదికి లక్ష రూపాయలకు పైగా ఆదాయం వస్తోందని చెబుతున్నారు. నిమ్మ, బత్తాయి, నారింజ, బొప్పాయి, సపోట, అరటి, దానిమ్మ, కేజీ జామ, సీతాఫలం, పైనాపిల్, అల్లనేరుడు లాంటి పండ్ల మొక్కలను రోశయ్య సేంద్రియ పద్ధతిలో పెంచుతున్నారు. ప్రకృతి సిద్ధంగా పండించిన పండ్లను విక్రయించడంద్వారా మంచి ఆదాయం సమకూరుతోందని వివరిస్తున్నారు. పండ్లమొక్కలతోపాటు చెరకుసైతం రోశయ్య సాగుచేస్తున్నారు. అంతేకాదు ఔషధ మొక్కలైన తులసి, ఉసిరి, కుంకుడుగాయల చెట్లను సైతం ఇక్కడ పెంచుతున్నారు. ఇదే వ్యవసాయ క్షేత్రంలో టమాట, వంకాయ, బెండ, కాకర, మిరప, మునగ ఇలా దాదాపు పదిరకాల కూరగాయలను రోశయ్య పండిస్తున్నారు. ఇంటి అవసరాలకు సరిపోగా మిగిలిన వాటిని విక్రయిస్తున్నారు. సేంద్రియ వ్యవసాయంలో ముఖ్యమైన ఆవులకు సరిపడా పశుగ్రాసాన్ని సైతం ఇక్కడే పెంచుతున్నారు. వాప్సా పద్ధతిలో నేలలోని తేమను సంరక్షిస్తున్నారు. పొలంలోని ఎర్రలు మొక్కలకు అవసరమైన పోషకాలు అందిస్తున్నాయి. మొక్కలను చీడపీడలనుంచి రక్షించే సేంద్రియ ఎరువులైన ఘన జీవామృతం, ద్రవజీవామృతం, నాడెప్ కాంపోస్టుని సైతం రోశయ్య సొంతంగా తయారు చేసుకుంటున్నారు. బీజామృతంతో శుద్ధి చేసిన విత్తనాలనే తన పొలంలో నాటుతున్నారు. ఈదురుగాలలనుంచి పంటలను కాపాడుకునేందుకు సరిహద్దు పంటగా టేకు, వేప, సీతాఫలం, ఉసిరి చెట్లను రోశయ్య పెంచుతున్నారు. ఐదంతస్తుల పంటవిధానాన్ని పాటిస్తే మంచి లాభాలుంటాయని ఆయన చెబుతున్నారు. రసాయనాలు వదిలి సేంద్రియ పద్ధతిలో ఆహారాన్ని పండించి ఆరోగ్యమైన సమాజంకోసం కృషిచేయాలని సూచిస్తున్నారు. ----------------------------------------------------------------------------------------------------------- Farmer Rosaiah who belongs to Athotu village, Guntur District, Andhrapradesh planted 24 different types of plants in his 75 cents of agriculture land. At the age of 73 he actively climbs the coconut tree and work for his Garden. We can see coconut, banana, pomegranate and many other fruit giving trees and Tomato, Bringal, Green chilli vegitable plants at his farmland. For the last 10 years he is fallowing 5 Layer Natural Farming Procedure to grow the plants and protect them from pests and insects. He makes bio fertilizers and bio pesticides at his farm and uses for plants.

Comments