Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Ep: 10 - Hindolam Raaga (హిందోళం రాగం) Vishleshana | Raaga Vaani | Learn Raagas | в хорошем качестве

Ep: 10 - Hindolam Raaga (హిందోళం రాగం) Vishleshana | Raaga Vaani | Learn Raagas | 1 год назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Ep: 10 - Hindolam Raaga (హిందోళం రాగం) Vishleshana | Raaga Vaani | Learn Raagas |

“భక్తి గీతాంజలి యూట్యూబ్ ఛానల్" వీక్షిస్తున్న సంగీత అభిమానులందరికీ నా హృదయపూర్వక వందనములు. హార్మోనియం మరియు కీ బోర్డు పై సంగీత శిక్షణలో భాగంగా రెండవ దశ అయిన “రాగవాణి" లో ఈనాటి మన రాగం “హిందోళం". “గ్రహభేదం" ద్వారా ఒకే స్వర స్థానాలలో ఏర్పడే 5 రాగాలలో మరో అద్భుతమైన ఔడవ ఔడవ రాగం. ఈ రాగం ఆరోహణము, అవరోహణములలో 5 స్వరములు కలిగి ఉంటుంది. జన రంజకమైన ప్రసిద్ధ రాగం. అన్నీ కోమల స్వరాలే అవడం వల్ల, చాలా హాయిగా, తీయగా ఉండే రాగం. మనోధర్మ సంగీతం పాడటానికి అనుకూలమైన రాగం. ఈ రాగం అన్నివేళలా పాడవచ్చు. హిందోళ రాగం ప్రశాంతతనిచ్చే రాగం, తన్మయత్వంలోనికి తీసుకుపోయే రాగం, నరనరాలలోకి ప్రవహించి ఒత్తిడి నుంచి విముక్తినిచ్చే రాగం. మనోధర్మానికి అనువైనరాగం కనుక కచ్చేరీలలో ఈ రాగాన్ని ముఖ్యమైన రాగంగా తీసుకొని చాలాసేపు పాడుతారు. నిర్దిష్టమైన రూపం కలిగిన హిందోళ రాగం కరుణ, భక్తి, శృంగార, శాంతి రసాలను పోషింప గలదు. సప్తస్వరాలలోని “ప”, “రి” స్వరాలు హిందోళంలో లేవు, అయినప్పటికీ ఘంటసాల మాష్టారు చాలా పాటలలో ఎక్కువగా పంచమాన్ని, కొన్ని చోట్ల చతుశృతి రిషభాన్ని వాడారు. ఈ రాగంలోని పాటలు వింటే జీర్ణ కాలేయ సంబంధమైన వ్యాధులు నిదానిస్తాయని పెద్దల మాట. ఈ రాగంలోని 5 స్వరాలు, 8 వ మేళకర్తా రాగమైన హనుమత్తోడిలోనూ భాగమైనవే ఐనా, ఇది 20 వ మేళకర్తా రాగమైన నఠభైరవి/నరభైరవి రాగానికి జన్య రాగం గా పెద్దలు చెపుతారు. ఈ హిందోళం రాగాన్ని హిందుస్థానీ లో మాల్కౌన్స్ అంటారు. మన తెలుగు భజన, డ్రామా గాయకులు మాల్కోస్ గా వ్యవహరిస్తున్నారు. ప్రాచీన, నవీన చలన చిత్ర సంగీత దర్శకులందరూ కూడా ఈ రాగంలో పాటలను చేసారు. ఆరోహణము, అవరోహణ లు చూద్దాం. ఆ: స గ2 మ1 ద1 ని2 స అ: స ని2 ద1 మ1 గ2 స రాగఛ్ఛాయ కోసం స్వర ప్రయోగం: సమగమా సగమా సగమదమా గమదమా గమదనీ గమదనిదమా సగమదనిసా గమదనిసా మదనిసా, దనిసా దనిసగసా దనిసగమా గమగ సగస నిసని దనిద మదమ గమగ సగస నిసని దనిద నిదనిసా... గమగసా. ఈ రాగంలో నా ద్వారా రచన పద్యం, రాగాలాపన ఆటవెలది: నీదు పదము సృష్టి నిఖిలమ్ములకు నెలవు నీదు పదము సురుల నికర రక్ష నీదు పదము గంగ నిజవాస నిలయమ్ము నీదు పదము పథము నీరజాక్ష . ఇప్పుడు ఈ రాగం లోని కృతులు, కీర్తనలు, సినిమా పాటలు, మొదలగునవేమున్నాయో చూద్దాం 1. సామజ వర గమనా - త్యాగరాజ స్వామి 2. దేవ దేవంభజే దివ్య ప్రభావం - అన్నమాచార్య 3. కట్టెదుర వైకుంఠము - అన్నమాచార్య 4. అంతయు నీవే హరిపుండరీకాక్ష - అన్నమాచార్య 5. నిగమ నిగమాంత వర్ణిత - అన్నమాచార్య 6. రామ కథను వినరయ్యా - లవకుశ 7. పగలే వెన్నెలా జగమే ఊయల - పూజాఫలం 8. నారాయణా హరి నారాయణా - చెంచులక్ష్మి 9. సందేహించకుమమ్మా - లవకుశ 10. పిలువకురా అలుగకురా - సువర్ణ సుందరి 11. రాజశేఖరా నీపై - అనార్కలి 12. మనసే అందాల బృందావనం - మంచి కుటుంబం 13. ఓం నమశ్శివాయ - సాగర సంగమం 14. సాగర సంగమమే - సీతాకోక చిలుక 15. గున్నమామిడీ కొమ్మమీద - బాల మిత్రుల కథ 16. నమ్మకు నమ్మకు ఈ రేయిని - రుద్ర వీణ 17. నన్ను వదిలి నీవు - (పల్లవి, మొదటి రెండు చరణాలు) - మంచి మనసులు 18. మోహన రూపా గోపాలా - కృష్ణ ప్రేమ 19. దైవం మానవ రూపంలో - శ్రీ షి సా బా సచ్చరిత్ర 20. కలనైనా నీ తలపే - శాంతి నివాసం 21. కరుణ జూడవయా - దీపావళి 22. బలపం పట్టి భామ బళ్ళో - బొబ్బిలి రాజా 23. దేవ దేవ పరంధామ (పల్లవి, రెండవ చరణం- సీతారామ కళ్యాణం 24. ఆ కనులలో కలల నాచెలీ - ఆలాపన 25. సుందర కాండ లోని 22-26, & 87- 90 26. భగవద్గీత లోని శ్లోకములు సుందర కాండ చరణములు: 022. యమ కుబేర వరుణ దేవేంద్రాదుల... 023. నేలను తాకక నిలచియుండునది... 024. లంకాధీశుని ప్రేమ మందిరము... 025. మత్తున శయనించు సుదతుల మోములు... 026. రావణుండు రణమందున గెలిచి... 087. ఓ హనుమంతా హాయిబొందితిని... 088. సర్వ జీవన సంప్రీతి పాత్రుడు... 089. అన్నకు తగు తమ్ముడు లక్ష్మణుడు... 090. పవన కుమారుని పలుకులను విని... భగవద్గీత లోని శ్లోకములు: 7 వ అధ్యాయం, జ్ఞానవిజ్ఞాన యోగం లో 19 వ శ్లోకం. బహూనాం జన్మనామంతే జ్ఞనవాన్ మాం ప్రపద్యతే వాసుదేవః సర్వమితి స మహాత్మా సుదుర్లభః 8వ అధ్యాయం, అక్షరబ్రహ్మ యోగం లో 5 వ శ్లోకం. అంతకాలే చ మామేవా స్మరన్ ముక్త్వా కలేవరమ్ యః ప్రయాతి స మద్భావం యాతి నాస్త్యత్ర సంశయః 18వ అధ్యాయం, మోక్ష సన్యాస యోగం లో 68 వ శ్లోకం. య ఇమం పరమం గుహ్యం, మద్భక్తేష్వభిధాస్యతి భక్తిం మయి పరాం కృత్వా మామేవైష్యత్య సంశయః 18వ అధ్యాయం, మోక్ష సన్యాస యోగం లో 71 వ శ్లోకం. కచ్చిదేతఛ్రుతం పార్థ త్వయైకాగ్రేణ చేతసా కచ్చిదజ్ఞాన సమ్మోహః ప్రణష్టస్తే ధనంజయ భజన కార్యక్రమాల విస్తృత శ్రేణిలో మా ప్రత్యేకతలు": *శ్రీకరమైన అన్నమయ్య, రామదాసు కీర్తనలు, సినీ భక్తి గీతాలు, సినీ గీత అనుకరణ గీతాలు, వివిధ కవుల కీర్తనలు, భజనలు, జయదేవుని అష్టపదులు, ఘంటసాల గారు ఆలపించిన భగవద్గీత, యమ్ యస్ రామారావు గారి “సుందరకాండ" గానము,a సమయోచిత వ్యాఖ్యానములు, సందర్భోచిత గాన వాయిద్య ప్రక్రియలు, సరాగబద్ధ పద్య ప్రయోగములు. *ఆలయ ప్రతిష్ఠాపనలు, వార్షికోత్సవములు, సమారాధనలు, ఉత్సవములు, పండుగ రోజులు, గృహప్రవేశములు, గృహంలో ప్రత్యేక పూజలు మరియు ఏ దైవకార్యముల కొరకైనా మా “భక్తి గీతాంజలి" వారిని సంప్రదించగలరు. *ప్రత్యేక గానవిశేషము:- దశకంఠ రావణ విరచిత “శివతాండవ స్తోత్రము“ To schedule program with us (Contact): Shree Geethacharya Bhakthi Geethanjali Steel Plant, Visakhapatnam. +91 8926683333 To Audio Recording and Video Editing (Contact): Shree Lakshmee Srinivasa Studios Steel Plant, Visakhapatnam. +91 8926683333

Comments