У нас вы можете посмотреть бесплатно రాష్ట్ర భవిత.. ప్రజాకాంక్షలకు పట్టం కట్టడమే ఎన్డీయే ప్రభుత్వ లక్ష్యం | или скачать в максимальном доступном качестве, которое было загружено на ютуб. Для скачивания выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса savevideohd.ru
రాష్ట్ర భవిత... ప్రజాకాంక్షలకు పట్టం కట్టడమే ఎన్డీయే ప్రభుత్వ లక్ష్యం •పార్టీలుగా వేరైనా మా అభిమతం రాష్ట్రాభివృద్ధి •రాష్ట్ర ప్రజలకు మేలు చేయడంపైనే ప్రధాన దృష్టి •ఆర్థిక పరిస్థితి గడ్డుగా ఉన్నా హామీల అమలుకు ప్రాధాన్యం •గ్రామాల స్వయం పాలన వైపు వేగంగా అడుగులు వేస్తున్నాం •కేంద్రం నుంచి రాష్ట్రానికి తగినంత సాయం 'ఎన్నికలకు ఆరు నెలల సమయం ఉండగానే రాష్ట్ర సరిహద్దులో అక్రమంగా నన్ను గత ప్రభుత్వం నిలువరించినపుడు గత ప్రభుత్వాన్ని హెచ్చరించాను. ప్రజలను ఇన్ని ఇబ్బందులు పెడుతూ, నిత్య దాష్టీకాలతో విసిగిస్తున్న ఈ ప్రభుత్వం మరో ఆరు నెలలు మాత్రమే ఉంటుందని చెప్పాను. అహంకారంతోనే, అవగాహన లేకుండానే ఆ మాట చెప్పలేదు. గత ప్రభుత్వం ప్రజలపై సాగించిన దుర్మార్గపు పాలనతో విసిగిపోయిన ప్రజల ఆవేదనే ఆ మాట చెప్పించింద'ని ఉప ముఖ్యమంత్రివర్యులు, జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనీవ్వను అని ఇప్పటం సభలో బలంగా చెప్పినపుడు నాకు ఎలాంటి రాజకీయ వ్యూహం లేదు.. రాష్ట్ర ప్రజలను దుష్ట పాలన నుంచి బయటపడేసి, సరికొత్త ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని ఆవిష్కరించాలనే బలమైన కోరిక మాత్రమే ఉందన్నారు. మూడు పార్టీల కలయిక కోసం ఎంతో శ్రమించాం.. ప్రజలను, మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలను చివరకు కలయికపై మనస్ఫూర్తిగా ఒప్పించామని చెప్పారు. నిండు మనసుతో, ఎన్నో ఆకాంక్షలతో ప్రజలు 93 శాతం స్ట్రైయిక్ రేటుతో విజయం కట్టబెట్టారనీ, దీన్ని బాధ్యతగా నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందని, ప్రతి ఒక్కరూ ప్రజలకు అండగా నిలిచి వారి సమస్యలు తీర్చేందుకు పని చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తి చేసుకుంటున్న తరుణంలో బుధవారం సీకే కన్వెన్షన్ సెంటర్లో ఎన్డీయే శాసనపక్ష సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి, తెలుగు దేశం జాతీయ అధ్యక్షులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు, బీజెపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ శ్రీమతి పురంధేశ్వరి గారు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్యే శ్రీ పల్లా శ్రీనివాస్ గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి తెలుగు దేశం, జనసేన, బీజేపీ నుంచి ఎన్నికైన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ‘‘ఎన్నికలకు ముందుగానే 160 స్థానాల్లో మనం విజయం సాధిస్తున్నామని బలంగా చెప్పిన నాయకులు శ్రీ చంద్రబాబు గారు. కించిత్ భయం ఆయన కళ్లలో ఏనాడూ కనిపించలేదు. ఎన్డీయే పాలన మొదలైన 100 రోజుల్లో శ్రీ చంద్రబాబు గారి నుంచి పాలనదక్షత, ఓపిక, కష్ట సమయంలో ఎలా ముందుకు వెళ్లాలనే విషయాలను నేర్చుకున్నాను. 53 రోజుల పాటు చంద్రబాబు గారిని గత ప్రభుత్వం అక్రమంగా జైలులో నిర్భందించినపుడు కనీసం సినిమా షూటింగ్ లకు కూడా వెళ్లాలని అనిపించలేదు. తెలంగాణతో సమానంగా మనం ముందుకు వెళ్లాలంటే రాష్ట్రంలోనూ సమున్నత నాయకత్వం, పాలనలో అనుభవం ఉన్న నాయకత్వం అవసరం అని భావించాను. దీనికి చంద్రబాబు గారి ఆలోచన తీరు రాష్ట్రానికి మార్గదర్శకం అవుతుంది. • 100 రోజుల్లో గ్రామ స్వరాజ్యం వైపు వేగంగా అడుగులు ఎన్డీయే పాలన మొదలై 100 రోజులు పూర్తి అయిన సమయంలో పురోగతితో ముందుకు వెళ్తున్నాం. ముఖ్యంగా గ్రామ స్వరాజ్యం దిశగా వేగంగా అడుగులు వేస్తున్నాం. మూడు అంచెల్లోని స్థానిక సంస్థలకు 2023-24 ఆర్థిక సంవత్సరం పెండింగ్ లో ఉన్న 15వ ఆర్థికసంఘం నిధులు రూ.998.62 కోట్లు విడుదల అయ్యాయి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.1076 కోట్లకు ప్రతిపాదనలు పంపాం. అవి ఆమోదం పొందాయి. పంచాయతీలు దాదాపు 70 శాతం మేర వైసీపీకు చెందిన నాయకుల చేతుల్లో ఉన్నాయి. అయినప్పటికీ జెండా పండుగను ఘనంగా నిర్వహించుకునేలా 5 వేల లోపు జనాభా ఉన్న పంచాయతీలకు రూ.10వేలు, 5 వేల జనాభా దాటిన పంచాయతీలకు రూ25 వేల చొప్పున జెండా పండుగ నిధులను పెంచాం. రాష్ట్రంలోని 13,326 గ్రామ పంచాయతీల్లో ఒకేసారి గ్రామ సభలను నిర్వహించడం ప్రపంచ రికార్డు అయింది. రాష్ట్ర స్ఫూర్తిని దేశమంతటా తీసుకునేలా చేశాం. 2024-25 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ వార్షిక ప్రణాళిక నుంచి రూ.217.80 కోట్ల నిధులు అందాయి. వాటి ద్వారా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు అవసరం అయ్యే శిక్షణ కార్యక్రమాలు ప్రతి జిల్లా స్థాయిలో చేపడతాం. గత ప్రభుత్వం మే నాటికి ఉపాధి హామీ కూలీలకు చెల్లించాల్సిన రూ.281 కోట్లను పెండింగ్ పెట్టింది. ఆ నిధులను వెంటనే విడుదల చేశాం. 46,745 ఎకరాల్లో ఉద్యాన మొక్కలు నాటాం. జల్ జీవన్ మిషన్ నిధులను గత ప్రభుత్వం అస్తవ్యస్తం చేసింది. పైనులైన్లు వేసి వదిలేసింది. ఈ నిధులను తిరిగి వినియోగించుకునేలా ఓ ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం. గత ప్రభుత్వ నిధుల వినియోగం విషయంలో పల్స్ సర్వే నిర్వహించి, తప్పులు ఎక్కడ జరిగాయో తెలుసుకుంటున్నాం. మొత్తం 87.47 లక్షల నివాసాల్లో సర్వే నిర్వహించాం. సర్వేను విశ్లేషిస్తున్నాం. సత్యసాయి జిల్లాలో సత్యసాయి వాటర్ వర్క్స్ కార్మికులకు 8 నెలలుగా పెండింగ్ ఉన్న రూ.30 కోట్ల వేతనాల నిధులను, ఆర్ డబ్ల్యూఎస్ కు శాఖలోని 102 వాటర్ ల్యాబోరేటరీల్లో పనిచేసే 526 మంది ఉద్యోగులకు పెండింగ్ జీతాల సొమ్ము రూ.4.17 కోట్లను విడుదల చేయించాం. రాష్ట్రంలో 50 శాతం పచ్చదనం ఉండాలనే లక్ష్యంతో 22 లక్షల మొక్కలను నాటాం. 14 కిలోమీటర్ల మేర రోడ్ల పక్కన మొక్కలను నాటాం. కొండల్లో నీటిని సంరక్షించేలా ట్రెంచెస్ ఏర్పాటు చేస్తున్నాం. వణ్యప్రాణుల సంరక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నాం. ఏనుగుల వల్ల పంట నష్టం అరికట్టేందుకు కర్ణాటక అటవీశాఖ మంత్రితో మాట్లాడి కుంకీ ఏనుగులు తీసుకొచ్చేందుకు ఒప్పందం చేసుకున్నాం. రైతులకు పంట నష్టం కలగకుండా చర్యలు తీసుకున్నాం. రూ.15.4 కోట్ల నిధులతో 23 నగర వనాలు ఏర్పాటు చేస్తున్నాం. 32 ఎకో టూరిజం పార్కులకు తోడు మరో 5 ఎకో టూరిజం పార్కుల ఏర్పాటుకు వేగంగా అడుగులు వేస్తున్నాం. విభజన గాయాల నుంచి రాష్ట్రం కోలుకోవాలి. గొప్పగా పరుగులు తీయాలి. రెండు తెలుగు రాష్ట్రాలు సమన్వయంతో ముందుకు సాగాలి. ఎన్టీయే కూటమి మూడు పార్టీల విభిన్నమైన ఆలోచనల సమాహారం అయినప్పటికీ ఆత్మ ఒక్కటే.. ఆలోచన ఒక్కటే. అదే రాష్ట్ర భవిత... ప్రజల ఆకాంక్ష ’’ అని అన్నారు.