Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Kims Hospital Kondapur Celebrates Three Hundred Joint Replacement Robotic Surgerys | Kims | h5tv в хорошем качестве

Kims Hospital Kondapur Celebrates Three Hundred Joint Replacement Robotic Surgerys | Kims | h5tv 4 дня назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Kims Hospital Kondapur Celebrates Three Hundred Joint Replacement Robotic Surgerys | Kims | h5tv

కిమ్స్ కొండాపూర్‌లో విజ‌య‌వంతంగా 300 ఫుల్లీ ఆటోమేటెడ్ రోబోటిక్ మోకాలి మార్పిడి శ‌స్త్రచికిత్స‌లు* ఆరుగురు ఆర్థోపెడిక్ స‌ర్జ‌న్ల‌కు శిక్ష‌ణ‌, ఫెలోషిప్‌లుహైద‌రాబాద్, సెప్టెంబ‌ర్ 20, 2024: కొండాపూర్‌లోని కిమ్స్ ఆస్పత్రిలోని అడ్వాన్స్‌డ్ రోబోటిక్ సెంట‌ర్ (ఏఆర్‌సీ)లో విజ‌య‌వంతంగా 300 ఫుల్లీ ఆటోమేటెడ్ రోబోటిక్ మోకాలి మార్పిడి శ‌స్త్రచికిత్స‌లు పూర్తిచేశారు. తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాలు రెండింటిలో మొట్ట‌మొద‌టిసారిగా ఏర్పాటుచేసిన ఈ ఏఆర్‌సీలో శ‌స్త్రచికిత్స‌ల ద్వారా రోగుల‌కు స‌త్ఫ‌లితాలు రావ‌డం, త‌క్కువ స‌మ‌యంలో కోలుకోవ‌డంలో స‌రికొత్త ప్ర‌మాణాల‌ను నెల‌కొల్పిన‌ట్ల‌యింది. కొరియాకు చెందిన అత్యాధునిక క్యువిస్ జాయింట్ రోబోటిక్ సిస్ట‌మ్ సాయంతో మోకాలి ఆస్టియోఆర్థ‌రైటిస్ లాంటి స‌మ‌స్య‌ల‌తో ఇబ్బందిప‌డే రోగుల‌కు అద్భుతంగా శ‌స్త్రచికిత్స చేయ‌డానికి వీలుంటుంది. హైద‌రాబాద్‌లో ఫస్ట్ ఫుల్లీ ఆటోమేటెడ్ రోబోటిక్ సిస్ట‌మ్ కావ‌డం విశేషం. కిమ్స్ ఆస్ప‌త్రుల సీఎండీ డాక్ట‌ర్ బొల్లినేని భాస్క‌ర్‌రావు, సీఈఓ డాక్ట‌ర్ అభిన‌య్ బొల్లినేని దూర‌దృష్టితోనే ఇన్ని విజ‌యాలు సాధ్య‌మైన‌ట్లు ఈ సంద‌ర్భంగా నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో కొండాపూర్ కిమ్స్ ఆస్పత్రికి చెందిన చీఫ్ క‌న్స‌ల్టెంట్ ఆర్థోపెడిక్, జాయింట్ రీప్లేస్‌మెంట్ స‌ర్జ‌న్ డాక్ట‌ర్ అన్నే సాయిల‌క్ష్మ‌ణ్ తెలిపారు.మ‌రింత ఉన్న‌త ప్ర‌మాణాలు: డాక్ట‌ర్ భాస్క‌ర్‌రావు“అందుబాటులో ఉన్న అత్యుత్త‌మ టెక్నాల‌జీ సాయంతో రోగుల‌కు అత్యున్న‌త స్థాయి వైద్యం అందించాల‌న్న‌దే ఎప్పుడూ మా ల‌క్ష్యం. ఇలా 300 రోబోటిక్ మోకాలి శ‌స్త్రచికిత్స‌లు చేయ‌డం మా బృందం నైపుణ్యం, నిబ‌ద్ధ‌త‌ల‌కు ప్ర‌తిరూపం. మ‌రిన్ని మైలురాళ్లు దాటుతూ, ఆర్థోపెడిక్ చికిత్స‌ల‌లో మ‌రిన్ని ఉన్నత ప్ర‌మాణాలు నెల‌కొల్పుతామ‌ని మాట ఇస్తున్నాను” అని డాక్ట‌ర్ బొల్లినేని భాస్క‌ర్‌రావు అన్నారు.వైద్యుల‌కు ఫెలోషిప్‌లు“దేశంలోనే తొలిసారిగా వైద్యులు, టెక్నీషియ‌న్లు, న‌ర్సుల కోసం ఇక్క‌డ ఒక ఫెలోషిప్ ప్రోగ్రాం నిర్వ‌హిస్తున్నారు. దేశ‌, విదేశాల నుంచి కిమ్స్ ఆస్ప‌త్రికి వ‌చ్చే వైద్యులు రోబోటిక్ మోకాలి శ‌స్త్రచికిత్స‌ల్లో కొత్త విధానాలు నేర్చుకుని, త‌మ త‌మ ప్రాంతాల్లోనూ అమ‌లుచేయ‌డానికి దీనివ‌ల్ల వీలుక‌లుగుతుంది. తొలిబ్యాచ్‌లో ఆరుగురు వైద్యులు ఈ ఆరు నెల‌ల ఫెలోషిప్ పూర్తిచేసి, ప‌రీక్ష‌ల్లో మంచి ఫ‌లితాలు సాధించినందుకు ఎంతో గ‌ర్వంగా ఉంది” అని డాక్ట‌ర్ సాయిల‌క్ష్మ‌ణ్ చెప్పారు. #kims #kimshospitals #kimshospital #hospital #roboticsurgeon #besthospital #hyderabad #telangana #healthtips #healthy #india

Comments