Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб ఉగాది పద్యం లలనా జనాపాంగ Ugadi Lalana janapanga | వసుచరిత్ర Vasu Charitra | Prashanti Chopra в хорошем качестве

ఉగాది పద్యం లలనా జనాపాంగ Ugadi Lalana janapanga | వసుచరిత్ర Vasu Charitra | Prashanti Chopra 3 года назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



ఉగాది పద్యం లలనా జనాపాంగ Ugadi Lalana janapanga | వసుచరిత్ర Vasu Charitra | Prashanti Chopra

#prashantichopra #telugu #ugadi #vasucharitra Very proud to present the famous poem from Vasu Charitra, a much celebrated literary work of 16th Century by Sri Ramaraja Bhushanudu (Bhattumoorti). A great concept to present it like a song, indeed! Music arranged by my friend & composer GP Raviin, elevated the presentation setting a natural soothing mood to my tune which I set in Madhyamavati Raga. Have a blessed Ugadi, everyone! Let this be a great new beginning in your life! Best wishes. Here's the text of the Padyam along with word meanings & a summary. లలనా జనాపాంగ వలనా వసదనంగ తులనాభికాభంగ దోఃప్రసంగ మలసానిల విలోలదళ సాసవ రసాల ఫల సాదర శుకాలపన విశాల మలినీ గరుదనీక మలినీకృత ధునీ క- మలినీ సుఖిత కోకకులవధూక మతికాంత సలతాంత లతికాంతర నితాంత రతికాంత రణతాంత సుతనుకాంత మకృత కామోద కురవ కావికల వకుల ముకుల సకల వనాంత ప్రమోద చలిత కలిత కలకంఠకుల కంఠకాకలీ వి- భాసురము వొల్చు మధుమాస వాసరంబు! వసంత ఋతువులోని ఒకానొక రోజు ఎలా ఉందో కవి రామరాజ భూషణుడు వసు చరిత్రలో వర్ణించిన విధం - లలనాజన = స్త్రీజనం యొక్క / అపాంగ = క్రీగంటి చూపుల / వలన = చలనంలో / అవసత్ = నివసించే / అనంగ = మన్మథునితో / తులన = సమానమైనవారైన / అభిక = కాముకుల యొక్క / అభంగ = అంతరాయం లేని / దోఃప్రసంగము = కౌగిలింతల ముచ్చట్లు కలదీ అలస = మెల్లగా వీచే / అనిల = గాలిచేత ( మందమారుతం చేత ) / విలోల = బాగా కదులుతున్న / దళ = చిగురాకులు కలవీ / స + ఆసవ = మకరందంతో కూడినవీ అయిన / రసాల = తియ్య మామిడి చెట్ల / సాదర = ఆదరంతో కూడిన / శుక = చిలుకల / ఆలాపన = ఆలాపాల చేత / విశాలము = విస్తారమైనదీ అలినీ = ఆడ తుమ్మెదల / గరుత్ = రెక్కల / అనీక = సమూహం చేత / మలినీకృత = నల్లగా చేయబడిన / ధునీ = నదీ సంబంధమైన / కమలినీ = తామర తీగల్లో / సుఖిత = సుఖంగా ఉన్న / కోకకుల వధూకము = చక్రవాక స్త్రీలు కలదీ అతికాంత = మిక్కిలి మనోహరాలైన /సలతాంత = పూలతో కూడిన / లతిక = తీగల / అంతర = లోపల / నితాంత = ఎడతెగని / రతికాంత = రతి భర్త ఐన మన్మథుని / రణ = యుద్ధంలో / తాంత = అలసిన / సుతనుకాంతము = స్త్రీ పురుషులు కలదీ అకృతక = సహజమైన / ఆమోద = పరిమళం కల / కురవక = గోరంట పువ్వులు కలవీ / అవికల = విచ్చిన్నం కాని / వకుళ = పొగడ చెట్ల / ముకుళ = మొగ్గలు కలవీ అయిన / సకల = సమస్త / వనాంత = వన మధ్యంలో / ప్రమోద = సంతోషంతో / చలిత = సంచరిస్తున్న / కలిత = ఒప్పుగా ఉన్న / కలకంట = కోయిలల / కుల = సమూహం యొక్క / కంట కాకలీ = కంఠంనుండి వెలువడే మధుర ధ్వని చేత / భాసురము = ప్రకాశిస్తున్న / మధుమాస వసరంబు = వసంత ఋతువులోని ఒక దినం / పొల్చున్ = విలసిల్లుతున్నది. వసంత ఋతువులోని ఒకానొక రోజు స్త్రీల కడగంటి చూపులు శృంగార రస ప్రేరితాలూ మన్మథోద్దీపకాలూ అయ్యాయి. కాముకులు స్వేచ్చగా క్రీడించారు. తియ్య మామిడి చిగురించి పండ్లు పండి ఫలరసాలు దొరికాయి. ఆ పండ్లను తిని చిలుకలు పలికాయి. నదులలో తామర తీగలు బాగ పూచాయి. వాటిని తుమ్మెదలు గుంపుగా కమ్ముకొన్నాయి. ఆ తామర తీగల్లో చక్రవాకాలు సుఖంగా ఉన్నాయి. పూ పొదరిండ్లలో స్త్రీ పురుషులు వినోదిస్తున్నారు. గోరంటలు పూచాయి. పొగడలు మొగ్గ తొడిగాయి. కోయిలలు మధుర ధ్వనులు చేసాయి.

Comments