Русские видео

Сейчас в тренде

Иностранные видео




Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Machilipatnam Assembly Constituency Elected MLAs 1952 - 2019

#MachilipatnamElections #MachilipatnamMLAs #APElections #Assembly Machilipatnam Assembly Constituency Elected MLAs 1952 - 2019 ******************************************************************** కృష్ణాజిల్లా బందరు ప్రాచీన, చారిత్రక, సాంస్కృతిక నేపథ్యం కలిగిన నియోజకవర్గం. విదేశీయులు వ్యాపారాలు నడిపిన ప్రాంతం. భారత దేశంలోనే మూడో ప్రాచీన మున్సిపాలిటీ కాగా.. రాష్ట్రంలో రెండో మున్సిపాలిటీగా ప్రాచుర్యం పొందిన ప్రాంతం. తీరపట్టణం అవడం చేత 17 వ శతాబ్దములో బ్రిటీష్‌ వారు, ఫ్రెంచ్‌ వారు డచ్‌ వారు ఇక్కడ నుండి వర్తకం జరిపేవారు. 350 పడవలు పట్టే సన్నకారు చేపల రేవు ఉంది. ఈ పట్టణం కలంకారీ అద్దకం పనికి (కూరగాయల నుండి తీసిన రంగు), తివాచీలకు, రోల్డ్ గోల్డ్‌ నగలకు, బందరులడ్డుకి ప్రసిద్ధి. మచిలీపట్నం నియోజకవర్గానికి ఎందరో ఉద్దండులైన రాజకీయ నాయకులను అందించిన ఘనత ఉంది. అంతటి ఘన చరిత్ర కలిగిన బందరులో రాజకీయ చైతన్యం సైతం అదే స్థాయిలో ఉంది. 1952 నుండి 2004 వరకు ఈ నియోజకవర్గం బందరుగా చెలామణిలో వుండి 2009లో మచిలీపట్నంగా మారింది. 1952లో జరిగిన మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో కాపు సామాజిక వర్గానికి చెందిన గుండాబత్తుల ఆంజనేయులు సిపిఐ పార్టీ నుండి గెలిచారు. 1955లో జరిగిన రెండవ అసెంబ్లీ ఎన్నికల్లో కాపు సామాజిక వర్గానికి చెందిన కొల్లిపర వెంకట రమణయ్య కాంగ్రెస్‌ పార్టీ నుండి గెలిచారు. 1959లో జరిగిన ఉప ఎన్నికలో కాపు సామాజిక వర్గానికి చెందిన రాళ్లపల్లి అచ్యుత రామయ్య కాంగ్రెస్‌ పార్టీ నుండి గెలిచారు. 1962, 1967, 1972 ఎన్నికల్లో మత్సకార సామాజిక వర్గానికి చెందిన పెదశింగు లక్ష్మణరావు ఒకసారి ఇండిపెండెంట్‌గా, రెండుసార్లు కాంగ్రెస్‌ నుండి... వరుసగా మూడుసార్లు గెలిచి హ్యాట్రిక్‌ సాధించారు. 1978లో జరిగిన ఆరవ అసెంబ్లీ ఎన్నికల్లో కాపు సామాజిక వర్గానికి చెందిన వడ్డి రంగారావు జనతా పార్టీ నుండి గెలిచారు. 1983లో జరిగి ఏడవ అసెంబ్లీ ఎన్నికల్లో యాదవ సామాజిక వర్గానికి చెందిన బొర్రా వెంకట స్వామి తెలుగుదేశం పార్టీ నుండి గెలిచారు. 1984లో జరిగిన ఉప ఎన్నికల్లోనే కాకుండా 1985లో జరిగిన ఎనిమిదవ అసెంబ్లీ ఎన్నికల్లో సైతం కాపు సామాజిక వర్గానికి చెందిన వడ్డి రంగారావు తెలుగుదేశం పార్టీ నుండి వరుసగా రెండుసార్లు గెలిచారు. 1989లో జరిగిన తొమ్మిదవ అసెంబ్లీ ఎన్నికల్లో కాపు సామాజిక వర్గానికి చెందిన పేర్ని కృష్ణమూర్తి కాంగ్రెస్‌ పార్టీ నుండి గెలిచారు. 1994లో జరిగి పదవ అసెంబ్లీ ఎన్నికల్లో కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి బ్రాహ్మణయ్య తెలుగుదేశం పార్టీ నుండి గెలిచారు. 1999లో జరిగిన పదకొండవ అసెంబ్లీ ఎన్నికల్లో మత్సకార సామాజిక వర్గానికి చెందిన నడకుదిటి నరసింహారావు తెలుగుదేశం పార్టీ నుండి గెలుపొందారు. 2004, 2009 ఎన్నికల్లో కాపు సామాజిక వర్గానికి చెందిన పేర్ని నాని వరుసగా రెండుసార్లు కాంగ్రెస్‌ పార్టీ నుండి గెలుపొందారు. ఈయన గతంలో ఇదే నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనిచేసిన పేర్ని కృష్ణమూర్తి కుమారుడు. 2014లో జరిగిన పద్నాలుగవ అసెంబ్లీ ఎన్నికల్లో మత్సకార సామాజిక వర్గానికి చెందిన కొల్లు రవీంద్ర తెలుగుదేశం పార్టీ నుండి గెలిచారు. 2019లో జరిగిన పదిహేనవ అసెంబ్లీ ఎన్నికల్లో కాపు సామాజిక వర్గానికి చెందిన పేర్ని నాని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నుండి గెలిచి, మొత్తం మూడు సార్లు గెలిచిన ఎమ్మెల్యేగా, ప్రస్తుత మంత్రిగా కొనసాగుతున్నారు. ఇదీ... మచిలీపట్నం నియోజకవర్గ సమాచారం. మరో నియోజకవర్గ సమాచారంతో మళ్లీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్‌ చేయండి, మీ స్నేహితులకు షేర్‌ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్‌ రూపంలో మాకు తెలియజేయండి. అలాగే, నియోజకవర్గాల వారీగా మేమందించే వీడియోలు మిస్‌ కాకుండా చూడాంటే తెలుగు ఐకాన్‌ టీవిని సబ్‌స్క్రయిబ్‌ చేసుకోండి. థ్యాంక్యూ వెరీమచ్‌.

Comments