Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб బాసర వెళ్ళే వారు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు || Basara complete Tour Telugu || в хорошем качестве

బాసర వెళ్ళే వారు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు || Basara complete Tour Telugu || 1 год назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



బాసర వెళ్ళే వారు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు || Basara complete Tour Telugu ||

భాసర అంటే తెలియని వారు ఎవరూ ఉండరు.. తెలంగాణా రాష్ట్రంలోని నిర్మల్ పట్టణానికి 75 కిలోమీటర్ల దూరంలో ఉంది బాసర. మన దేశంలో ఉన్న ప్రముఖ సరస్వతి దేవాలయాల్లో ఒకటి కాశ్మీర్ లో ఉండగా. రెండవది ఇదే నని చెప్పుకోవాలి. బాసరలో జ్ఞాన సరస్వతి అమ్మవారు మహాలక్ష్మీ, మహాకాళీ సమేతులై కొలువు తీరి ఉన్నారు. ఇక్కడి ఆలయాన్ని చాళుక్యుల కాలంలో నిర్మించారు. బాసర క్షేత్రాన్ని వేదవ్యాసుడు ప్రతిష్టించినట్లు స్థల పురాణాలు చెబుతున్నాయి. కురుక్షేత్ర యుద్దానంతరం వేదవ్యాసుడు మన శ్సాంతి కోరుకుని ఆయన కుమారుడు శకునితో దండకారాణ్యానికి వచ్చి ఇక్కడ గోదావరి తీరాన ఉన్న ప్రశాంత వాతావరణానికి ముగ్దుడై ఈ ప్రాంతంలో కుటీరాన్ని ఏర్పాటుచేసుకుని తపస్సును ప్రారంభించారు. నాడు ఆయన తపస్సు చేసిన ప్రాంతాన్నికూడా మనం ఈ ఆలయంలో చూడవచ్చు.. వేద వ్యాస మహర్షి తపస్సుకు జగన్మాత దర్శనమిచ్చి ముగ్గురమ్మలకు ఆలయాన్ని నిర్మించమని ఆదేశించారు. దీంతో గోదావరి నదినుండి మూడు గుప్పెళ్ళు ఇసుక తెచ్చి ముగ్గురు దేవతల మూర్తులను వ్యాసుడు ప్రతిష్ఠించాడు. వ్యాసుడు ప్రతిష్ఠించిన కారణంగా అప్పటినుండి వ్యాసపరి, వ్యాసరగా పిలబడి కాల క్రమేనా బాసరగా నామాంతరాన్ని సంతరించుకుంది. ఇక్కడ చేరుకోవాలంటే చాలా ప్రాంతాల నుండి రైలు సౌకర్యం ఉంటుంది. బాసర రైల్వే స్టేషన్ నుండి ఆలయానికి సుమారు 2 నుండి 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది. రైలు దిగి స్టేషన్ బయటకు రాగానే మనకు సర్వీస్ ఆటోలు కనిపిస్తాయి.. ఈఆటోల్లో మనం ఆలయానికి చేరుకోవచ్చు.. ఇక్కడ అన్ని రకాలకు చెందిన సత్రాలు అందుబాటులో ఉంటాయి.. వాటితో పాటు టీటీడీ గదులు, ఇతర ప్రయివేటు లాడ్జిలు, గదులు అద్దెకు లబిస్తాయి.. ముఖ్యంగా శుక్ర,శని ఆదివారాల్లో జనాభా అధికంగా ఆలయానికి వస్తారు.. అలానే వసంత పౌర్ణమి, దసరా వేళల్లో భక్తులు అధికంగా వస్తారని ఇక్కడి స్థానికులు బెబుతున్నారు. ఇక ఆలయ విషయానికి వస్తే.. ఇక్కడ తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేస్తే విద్యలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని ప్రసిద్ధి... ఈ ఆలయంలో అక్షరా భ్యాసానికి రెండురకాలుగా టికెట్ లు ఉంటాయి.. ఒకటి 100 రూపాయల టికెట్ ఈ 100 రూపాయల టికెట్ తీసుకున్న వారిని ఆలయానికి వెలుపల ఉన్న ఒక గదిలో అక్షరాబ్యాసం చేయిస్తారు. అలానే 1000 రూపాయల టికెట్ ను కొనుగోలు చేయడం ద్వారా ఆలయం లోపల అమ్మవారి గర్భగుడి ముందు అక్షరా బ్యాసం చేయిస్తారు. #basara #basara2 #aksharabhyasam #vasutvtelugu ‪@vasutvtelugu‬ #tour #tours #torism #temple #gnanasaraswathitemple

Comments