Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб TSPSC Group 1 రద్దు -హైకోర్టు ఆదేశం | ప్రస్తుత బోర్డు తో పరిక్షల నిర్వహణ సాధ్యమేనా ? в хорошем качестве

TSPSC Group 1 రద్దు -హైకోర్టు ఆదేశం | ప్రస్తుత బోర్డు తో పరిక్షల నిర్వహణ సాధ్యమేనా ? 1 год назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



TSPSC Group 1 రద్దు -హైకోర్టు ఆదేశం | ప్రస్తుత బోర్డు తో పరిక్షల నిర్వహణ సాధ్యమేనా ?

కమిషన్‌ను ప్రక్షాళన చేయాలి టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1 ప్రిల్సిమ్‌ నోటిఫికేషన్‌ విడుదలైనప్పటి నుంచి నిరుద్యోగ అభ్యర్థులు, పోటీ పరీక్ష నిపుణులు అందులోని లోపాలను ఎత్తిచూపుతున్నారు. ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం వెలుగులోకి వచ్చాక సర్వీస్‌ కమిషన్‌ ఒక ప్రెస్‌ నోట్‌ రిలీజ్‌ చేసి అలాంటిదేమీ లేదన్నది. అప్పుడే సర్వీస్‌ కమిషన్‌ ఛైర్మన్‌, సభ్యులు పారదర్శకంగా వ్యవహరించడం లేదని, నిరుద్యోగుల సందేహాలపై సరిగ్గా స్పందించడం లేదని విమర్శలు వచ్చాయి. చివరికి ఆ పరీక్షతో పాటు మరికొన్ని నోటిఫికేషన్లు రద్దు చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత జూన్‌ 11న నిర్వహించిన సమయంలో అయినా మొదటిసారి జరిగిన లోపాలు పునరావృతం కాకుండా మరింత పకడ్బందీగా నిర్వహించాలి. కానీ బయోమెట్రిక్‌ వివరాలు తీసుకోకుండా హాల్‌ టికెట్‌ నంబర్‌ లేకుండా ఓఎంఆర్‌ షీట్లు ఇచ్చారని పలువురు విద్యార్థులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కోర్టు దీనిపై విచారణ చేపట్టి రద్దు చేసి మరోసారి పరీక్ష నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. సర్వీస్‌ కమిషన్‌ ఇచ్చిన నోటిఫికేషన్లు, గురుకులాల నోఫికేషన్లలో హరిజంటల్‌\ వర్టికల్‌ అంశంపై వివాదం నడుస్తున్నది. ఇటీవలే కోర్టు గురుకుల నియామకాల్లో హరిజంటల్‌ విధానాన్ని అమలు చేయాలని ఆదేశించింది. ఈ విధానాన్ని అమలు చేయకపోతే త్వరలో జరగనున్న గ్రూఫ్‌-2, 3 పరీక్షలపై కూడా నిరుద్యోగులు హైకోర్టు కు వెళ్లే అవకాశం ఉన్నది. హరిజంటల్‌\ వర్టికల్‌ విధానంపై పక్కనున్న ఏపీ రాష్ట్రం కూడా ఐఏఎస్‌ కమిటీ ఏర్పాటు చేసింది. వాళ్లు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని నివేదిక ఇచ్చారు. ఆ రాష్ట్ర ప్రభుత్వం హరిజంటల్‌ విధానాన్ని అమలు చేస్తామని కోర్టుకు తెలిపారు. అందుకే అక్కడ ఇలాంటి వివాదాలు తలెత్తడం లేదు. కానీ తెలంగాణ ప్రభుత్వం దీనిపై ఎలాంటి సమీక్ష, కమిటీలు ఏర్పాటు చేయలేదు. కోర్టు ఆదేశించినా దీనిపై సమగ్ర విధానాన్ని రూపొందించలేదు. సర్వీస్‌ కమిషన్‌ వ్యవహారం వల్ల ఇటు ప్రభుత్వానికి ఎలాంటి నష్టం లేదు. కానీ ఏళ్ల తరబడి లక్షలు ఖర్చు పెట్టి ప్రిపేర్‌ అవుతున్న నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారు. కాబట్టి ప్రభుత్వం సర్వీస్‌ కమిషన్‌ పారదర్శకంగా పనిచేయడానికి, జవాబుదారీతనాన్ని పెంపొందించడానికి కమిషన్‌ను ప్రక్షాళన చేయాలి. లేకపోతే ఇలాంటి ఘటనలే పునరావృతమవుతాయి. ఫలితంగా నిరుద్యోగులకు తీరని నష్టం జరుగుతుంది. -ప్రభాకర్‌ చౌటి, పోటీ పరీక్షల నిపుణులు

Comments